సమాజం ఎంత అభివృద్ధి చెందినా…ఇప్పటికీ స్త్రీ దృక్పథం ఏ మాత్రం మారలేదు. మహిళలు నిరంతరం హింసకు గురువుతూనే ఉన్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే…భయంకరమైన సంఘటనలెన్నో..మరింత భయాన్ని పెంచుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ ఇంకెంత కాలం అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.
ఇప్పుడు మనం 2023వ సంవత్సరంలోకి ప్రవేశించాము. ప్రపంచం చాలా మారిపోయింది. టెక్నాలజీ జెడ్ స్పీడ్ తో దూసుకుపోతోంది. కానీ మహిళల భద్రతకు సంబంధించిన చట్టలెన్నో వచ్చాయి. భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ల రూపంలో మాత్రం ఉన్నాయి. ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు.
మహిళల భద్రత గురించి ఇప్పటికీ పెద్ద ప్రశ్నే. ఓ వైపు భద్రతాచర్యలు అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వాలు చెబుతుంటే…మరో వైపు మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. National Crime Beauro Data దీనికి నిదర్శనం. NCRB ప్రకారం జనవరి 1, 2021 నుంచి జూలై 15,2021 వరకు దేశ రాజధాని ఢిల్లీలోనే 6,747 క్రిమినల్ కేసులు నమోదు కాగా…2022లో ఈ సంఖ్య 7,887కు పెరిగింది. గతేడాది జూలై 15వరకు నగరంలో 11వందల అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. 2021లో 1,033కేసులు నమోదు కాగా…ఢిల్లీకి చెందిన అంజలీ సింగ్ సువానీ కేసు…మళ్లీ మహిళల భద్రతపై ప్రశ్నను లేవనెత్తింది.
శ్రద్ధా వాకర్ హత్య కేసు:
మే 18, 2022న శ్రద్ధా వాకర్ అనే అమ్మాయి ఢిల్లీలో హత్యకు గురైంది. ఆమెను తన ప్రియుడు అఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. 6నెలల తర్వాత తన కూతురు కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన యావత్ భారతాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
2019 హైదరాబాద్ డాక్టర్ కేసు:
26ఏళ్ల వెటర్నరీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం…దేశాన్ని కదిలిచింది. అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైంది. రేపిస్టులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
ఉన్నావ్ రేప్ కేసు :
జూన్ 4, 2017 యూపీలోని ఉన్నావ్ లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 17ఏళ్ల బాలికపై రేప్ జరిగింది. బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది.
హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు:
యావత్ దేశానికి కంటిమీది కునుకు లేకుండా చేసిన మరో కేసు ఇది. 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. యూపీలోని హత్రాస్‌లో అత్యాచారం ఘటన వెలుగు చూసింది.
కథువా రేప్ కేసు:
8 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి చంపిన ఈ ఘటనను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని కతువా సమీపంలోని రసనా బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిర్భయ రేప్ కేసు:
ఇక నిర్భయ కేసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎంత భయంకరమైన ఘటన అంటే…ఊహించుకుంటేనే జల్లు మంటుంది. 2012 డిసెంబర్ 16న అర్థరాత్రి జరిగిన షాకింగ్ ఘటన భారతావని ఉనికి ప్రశ్నర్థకంగా మారింది.
కర్ణాటక రేప్ కేసు:
కర్ణాటకలో 2018 నుంచి 2021 వరకు అనేక అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో ప్రతి నెలా 30 శాతం అత్యాచార కేసులు నమోదవుతున్నాయి.