Nora Fatehi : slapped co-star for misbehaving with her
mictv telugu

నాకు కోపం వచ్చింది..ఆ హీరో చెంప పగలగొట్టా: నోరా ఫతేహి

March 2, 2023

Nora Fatehi : slapped co-star for misbehaving with her

Nora Fatehi : వెండి తెరమీద కనిపించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు లక్కు ఉండాలి. ఒక్కసారైనా స్క్రీన్ మీద మెరవాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెడతారు హీరోయిన్ లు. ఛాన్స్ రావడం గొప్పకాదు. వచ్చిన అవకాశాన్ని చేజారకుండా విజయపథంలో ముందుకు సాగాలంటే మాత్రం అడుగడుగునా ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరోయిన్ అంటే చాలు హీరో దగ్గరి నుంచి టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఆమెతో మిస్ బిహేవ్ చేసేందు ప్రయత్నిస్తుంటారు. అయినా ఇన్ని కష్టాలను దాటుకుని తమను తాము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళతారు తారలు. అలాంటి ఓ ఛేదు అనుభవమే బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహికి ఎదురైంది. ఆమె మొదటి సినిమాలోనే తన సహ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో సహించలేకపోయిన నోరా ఫైర్ బ్రాండ్ అవతారమెత్తి అతని చెంప చెల్లుమనిపించింది. ఈ విషయాన్ని నోరా ఫతేహి తన తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తతుం ఈ వీడియో నెట్టింట్లో వైలర్ అవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర, వెండితెర మీద కనిపిస్తూ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఫిదా చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఆల్ మోస్ట్ ఐటెమ్ సాంగ్స్ లలో కనిపిస్తూ అందరిని ఉర్రూతలూగిస్తుంది నోరా ఫతేహి. తెలుగులోనూ బాహుబలి, టెంపర్, కిక్ 2 సినిమాల్లోనూ ప్రత్యేక గీతాల్లో కనిపించి తన డ్యాన్స్ మూవ్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఓ వైపు బుల్లితెరపైన డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా కొనసాగుతూ మరోవైపు సినిమాలో ప్రత్యేక గీతాల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అభిమానుల ఆదరణను పొందుతోంది ఈ డ్యాన్సింగ్ క్వీన్ . తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.

రోర్ అనే హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నోరా. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం బంగ్లాదేశ్ కు వెళ్లిన నోరా అక్కడ తన సహ నటుడు తనతో ప్రవర్తించిన తీరును గురించి ఇంటర్వ్యూలో తెలిపింది. ” షూటింగ్ లో కో స్టార్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, కోపంతో అతని చెంప చెల్లుమనిపించాను, దీంతో ఆ హీరో నన్ను కొట్టాడు, ఇద్దరం జుట్లు పట్టుకుని మరీ కుస్తీ పట్టాము, సెట్ లోని వారందరి ముందే మేము కొట్టుకున్నాము, పరిస్థితిని చూసిన డైరెక్టర్ స్పాట్ కి వచ్చి సర్దిచెప్పడంతో వివాదం కాస్త ముగిసింది”.

మోడల్ , డ్యాన్సర్, సింగర్, నటి అయిన కెనెడియన్ బ్యూటీ నోరా ఫతేహి బాలీవుడ్ లో తనదైన గుర్తింపును సంపాదించుకుంది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లోనూ అనేక ఐటెమ్ పాటల్లో తన అద్భుతమైన అందంతో , డ్యాన్స్ మూవ్స్ తో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. టెలివిజన్, వెబ్ సీరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపించి క్రేజీ హీరోయిన్ గా ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.