హైదరాబాదులో కొత్తగా నోరో వైరస్.. ఐదు కేసులు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదులో కొత్తగా నోరో వైరస్.. ఐదు కేసులు నమోదు

April 18, 2022


ఇప్పటికే కరోనా వైరస్‌ వల్ల ప్రజలు, వ్యవస్థలు అతలాకుతలం అవుతుంటే నగరంలో కొత్త వైరస్ బయటపడడం సంచలనంగా మారింది. నోరో అని పిలువబడే కొత్త వైరస్‌ను మైక్రోబయాలజిస్టులు ఐదేళ్లలోపు చిన్నారుల్లో గుర్తించారు. గాంధీ హాస్పిటల్, ఎల్లా ఫౌండేషన్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 458 మంది ఐదేళ్లలోపు చిన్నారుల మల మూత్రాలను పరిశీలించగా, ఐదుగురిలో ఈ వైరస్ ఉన్నట్టు వెల్లడించారు. దీని వల్ల డయేరియా (అతిసారం) వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి లక్షణాలుంటాయో వారు వివరించారు.
లక్షణాలు
1. వాంతులు, విరేచనాలు ఉంటాయి
2. శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది
3. శరీరం వెచ్చబడి, ఉన్నట్టుండి నీరసించిపోతారు
4. శరీరంలో నీరు, లవణాల శాతం తగ్గిపోతుంది
5. తగిన జాగ్రత్తలు పాటించపోతే ప్రాణాలకే ప్రమాదం
వైరస్ సోకితే ఏం చేయాలి
1. తగినంత విశ్రాంతి తీసుకోవాలి
2. ద్రవ పదార్ధాలు తరచూ తీసుకోవాలి
3. వేడి వాతావరణం లేకుండా చూసుకోవాలి
4. శిశువులు అయితే పాలు ఇవ్వడం ఆపకూడదు
5. వాంతులు, విరేచనాలు కంట్రోల్ లేకుండా అవుతుంటే వైద్యులను సంప్రదించాలి.