చైనాకు వెళ్లొచ్చిన అధికారిని చంపేసిన ఉత్తర కొరియా!  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు వెళ్లొచ్చిన అధికారిని చంపేసిన ఉత్తర కొరియా! 

February 13, 2020

North Korea.

కరోనా వైరస్ ప్రపంచాన్నే కాకుండా నియంతలకు కూడా వెన్నులో చలిపుట్టిస్తోంది. చైనాకు వెళ్లొచ్చిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి ఉత్తర కొరియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. అతడు నిబంధనలు ఉల్లంఘించి, బహిరంగ స్నానవాటికకు వెళ్లడమే దీనికి కారణమని తెలుస్తోంది. 

డాండా ఇల్బో అనే దినపత్రిక కథనం ప్రకారం.. వాణిజ్య విభాగ అధికారి ఒకరు ఇటీవల చైనాకు వెళ్లి తిరిగొచ్చాడు. అతనికి కరోనా రోగం సోకి ఉంటుందనే అనుమానంతో అధికారులు జనం మధ్యకు రాకుండా కట్టడి చేశారు. అయితే ఆయన లెక్క చేయకుండా స్నానవాటికకు వెళ్లాడు. పోలీసులు ఆయను పట్టుకుని కాల్చి చంపేశారు. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీసుకొచ్చిన సైనిక నిబంధనల కింద అతణ్ని చంపేసినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో ఇంతవరకు కరోనా వైరస్ బయటపడినట్లు ఆధారాల్లేవు. అయితే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.