North korea Kim Jong Un for help Russia in Ukraine and offering energy and grain in return for 100,000 soldiers
mictv telugu

ఉక్రెయిన్‌పై యుద్ధానికి లక్షమంది ఉ.కొరియా సైనికులు!

August 5, 2022

ఉక్రెయిన్, రష్యాల యుద్ధం కాస్తా ప్రపంచ యుద్ధానికి దారితీస్తోంది. ఇప్పటికే పలు యూరప్ దేశాలతోపాటు అమెరికా కూడా ఉక్రెయిన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేస్తున్నాయి. మరోపక్క రష్యాకు కూడా కొన్ని దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు ‘ధూర్తదేశ’మని తిట్టిపోసే ఉత్తర కొరియా కూడా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధంలో రష్యాకు సాయంగా లక్షమంది సైనికులను పంపేందుకు సన్నాహాలు సాగుతున్నట్లు సమాచారం. ఆ సైనికులను పంపినందుకు ప్రతిఫలంగా రష్యా ఉత్తర కొరియాకు భారీ స్థాయిలో ఇంధనం, ధాన్యాన్ని సరఫరా చేయాలని భావిస్తున్నట్లు రష్యన్ మీడియా చెబుతోంది. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోడానికి ఉత్తర కొరియాకు ఆ సాయం అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ఉత్తర కొరియా సాయం చేస్తే తీసుకోడానికి మాకు మొహమాటమేమీ లేదు. కొరియా నుంచి లక్షమంది యుద్ధ వలంటీర్లు సిద్ధంగా ఉన్నాట్లు తెలుస్తోంది’ అని రష్యా సైన్యాధికారి ఇగర్ కోరోచెంకో అన్నారు. రష్యాకు, ఉత్తర కొరియాకు సంబంధాలు బలంగా ఉన్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడేళ్ల కిందట ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను కలుసుకున్నారు. కమ్యూనిస్టు దేశమైన ఉ.కొరియాను 1948లో తొలిసారిగా గుర్తించింది అప్పటి సోవియట్ రష్యానే. మరోపక్క.. రష్యా దాడులను కాచుకోడానికి ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే అనైతిక యుద్ధ వ్యూహాలను అమలు చేస్తోందని ఆమ్నెస్టీ హక్కుల సంస్థ ఆరోపించగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్‌స్కీ కొట్టిపడేశాడు.