ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే. ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి కాంట్రవర్శఈగానే ఉంటాయి. మొన్నటికి మొన్న చాలా రోజులు కనిపించకుండా అందరికీ అనుమానాం కలిగేలా చేశారు. తర్వాత కూతురిని బాంక్వెట్ కి తీసుకొచ్చి తన తర్వాత కూతురే అధ్యక్షురాలు అన్నట్టు క్రియేట్ చేశారు. ఇప్పడేమో మరో కొత్త నిర్ణయంతో అందరినీ విస్మయపరుస్తున్నారు.
మొన్న జరిగిన దానిలో కిమ్ కూతురు ప్రధాన ఆకర్షణగా నలిచింది. మంచి రిచ్ డ్రస్ తో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఈ అమ్మాయినే కిమ్ తన పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉన్న మీటింగ్స్ అన్నింటికీ తీసుకువస్తున్నారు. అదే కిమ్ తర్వాత జుయే నే వారసురాలు అనే ఊమాగానాలకు తెరలేపింది. ఇప్పడు తాజాగా దానికి ఊతమిస్తూ కిమ్ జు యే అని పేర్లున్న వాళ్ళందరూ పేరు మార్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కిమ్, ఆయన భార్య సోల్ జు పేర్లు ప్రజలు పెట్టుకోవడం మీద నిషేధం ఉంది. ఇప్పడు ఆ లిస్ట్ లోకి కూతురు పేరు కూడా చేరింది.
రాచరికపు వారసత్వానికి కిమ్ తెర లేపుతున్నారని అందరూ అంటున్నారు. మామూలుగా తన కుటంబాన్ని ఎప్పుడు బయటకు తీసుకురారు. అలాంటిది ఈ మధ్య కూతురిని ఇలా అఫీషియల్ మీటింగ్స్ కి తీసుకురావడం కారణం అదే అని అంటున్నారు. తన తర్వాత పగ్గాలు చేపట్టేది కూతురే అంటూ కిమ్ ప్రపంచానికి తెలియజేస్తున్నారు.