కిమ్ ఆస్తులు..370000000,000 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

కిమ్ ఆస్తులు..370000000,000 కోట్లు

June 5, 2020

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆస్తుల గురించి మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిన్న దేశానికి అధిపతి అయినప్పటికీ కిమ్ ఆస్తులు బానే కూడబెట్టారని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. 

ఫోర్బ్స్ మొదలగు మ్యాగజైన్ లు ప్రకటించే ప్రపంచ కుబేరుల జాబితాల్లో కిమ్ జాంగ్ ఉన్ పేరు కనిపించదు గానీ.. అతని ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందేనట. కిమ్‌కు సుమారు 5 బిలియన్ డాలర్లకు(రూ. 37వేల కోట్లు) పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కూడా ఉత్తర కొరియాలోని సహజ సంపదనను అమ్మి పోగుజేశారని తెలుస్తోంది. దేశం నష్టాల్లో ఉన్నా కూడా అతను ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడట.