North Korea sent 180 fighter jets to the Korean border
mictv telugu

180 యుద్ధ విమానాలను పంపిన కిమ్.. వెంటాడిన ఫైటర్ జెట్స్

November 4, 2022

కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. సోమవారం నుంచి సాగుతున్న అమెరికా, దక్షిణ కొరియాల వైమానిక దళాల విన్యాసాలపై గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్.. అందుకు ధీటుగా తనదైన శైలిలో స్పందించాడు. కేవలం రెండు రోజుల్లోనే 25కి పైగా దీర్ఘశ్రేణి, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాడు. అంతటితో ఆగక, శుక్రవారం దాదాపు 180 యుద్ధ విమానాలను దక్షిణ కొరియా సరిహద్దుల్లో కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టించాడు. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా ఎఫ్ 35 ఫైటర్ జెట్లతో వెంబడించినట్టు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. సైనిక విభజన రేఖకి ఉత్తరాన 20 కిలోమీటర్ల వరకు ఉత్తర కొరియా విమానాలు ప్రయాణించాయని తెలిపింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ వింటేజ్ స్మార్ట్ పేరుతో చేపట్టిన విన్యాసాలను మరికొద్ది రోజులు కొనసాగించాలని అమెరికా, దక్షిణ కొరియాలు నిర్ణయించాయి.