North Korea’s Kim Jong Un seen hand-in-hand with daughter in her 1st public appearance
mictv telugu

మొదటిసారి కుమార్తెను చూపెట్టిన కిమ్..

November 19, 2022

North Korea’s Kim Jong Un seen hand-in-hand with daughter in her 1st public appearance

ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్’ వ్యక్తిగత జీవితం ఒక రహస్యం. ఆయన బాహ్యప్రపంచంలో తక్కువగా కనిపిస్తారు. కిమ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ పెద్దగా తెలీదు. కొత్త క్షిపణులతో ప్రపంచాన్ని భయపెట్టడమే తప్ప..కిమ్ తన కుటుంబ గురించి పరిచయం చేసింది..బయటకు తీసుకొసిచ్చిన సందర్భాలు చాలా తక్కువ.

కానీ ఈ మధ్య కిమ్ చాలా మారిపోయారు. ఏడు నెలల క్రితం తన భార్యతో ఓ థియేటర్లో సందడి చేసిన కిమ్..తాజాగా కుమార్తెతో కనిపించడం హాట్ టాపికైంది. కుమార్తె చేయ పట్టుకుని నడుస్తున్న కిమ్ ఫోటోలను అక్కడి అధికార మీడియా ప్రచురించింది. శుక్రవారం ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు. కిమ్‌కు ఎంతమంది పిల్లలు ఉన్నారనే విషయంపై సమాచారం లేనప్పటికీ ఆయనకు ముగ్గురు పిల్లలున్నారని చెబతుంటారు. ఇక శుక్రవారం ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఓ ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈ నెలలో ప్రయోగించిన రెండో ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది.

North Korea’s Kim Jong Un seen hand-in-hand with daughter in her 1st public appearance