nose grown on woman’s arm was transplanted to her face
mictv telugu

మహిళ చేతిపై ముక్కు

November 12, 2022

nose grown on woman’s arm was transplanted to her face

ముఖంపై కళ్లు కింద ఉండాల్సిన ముక్కు ఓ మహిళ చేయిపై పెరిగింది. వైద్యుల అద్భుత సృష్టితో ఇది సాధ్యమైంది. పెరుగుతున్న సాంకేతికత సాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు వైద్యులు. తాజాగా మహిళ చేతిపై ముక్కును పెంచి, దాన్ని ముఖానికి అతికించి ఫ్రాన్స్ వైద్యులు చరిత్ర సృష్టించారు.

టౌలౌస్‌కు చెందిన ఓ మహిళ ముక్కు కుహరం క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమెకు 2013లో వైద్యులు రేడియోథెరపీ మరియు కీమోథెరపీ చికిత్స అందించారు. చికిత్స కార‌ణంగా ఆమె ముక్కులో చాలా భాగం కోల్పోయింది. ముక్కు లేకుండానే ఆమె గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జీవిస్తోంది. అయితే టౌలౌస్ యూనివర్సిటీ వైద్యులు అద్భుత సృష్టితో ఆమె కోల్పోయిన ముక్కును తిరిగి పొందగలిగింది. ఆమె కోసం ప్రత్యేక ముక్కును వైద్యులు తయారు చేశారు. మృదులాస్థి స్థానంలో 3D-ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో కస్టమ్ ముక్కును సృష్టించి దానిని ఆమె చేయిపై రెండు నెలలు పెంచారు. అనంతరం దానిని తీసుకొచ్చి మైక్రో సర్జ‌రీ ద్వారా ముఖం వ‌ద్ద ఉండే ర‌క్త‌నాళాల‌ను ఒక్కోదాన్ని 3డీ ముక్కు నాళాల‌తో క‌లుపుతూ ఆప‌రేష‌న్‌ను విజ‌యవంతంగా పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వెద్యులు తెలిపారు. టౌలౌస్ యూనివ‌ర్సిటీ హ‌స్పిట‌ల్ ఫేస్‌బుక్‌లో ముంజేయిపై పెరుగుతున్న ముక్కు ఫోటోల‌ను షేర్ చేసింది.