మునిసిపల్ ముక్కు పుడకలు.. అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మునిసిపల్ ముక్కు పుడకలు.. అరెస్ట్

January 22, 2020

Nose ornaments in the municipal .. Attracting female voters

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ఈ రోజు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల అధికార, విపక్షాల అభ్యర్థులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఉద్రిక్తతలు శ్రుతిమించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కును కాంగ్రెస్ అభ్యర్థి కొరకడం స్థానికంగా కలకలం రేపింది. ఇదిలావుండగా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. దీంతో ఓటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. కాసుల ఎరజూపి పోలింగ్ రోజు కూడా అభ్యర్థులు ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 

అభ్యర్థులు తమ అనుచరులచే వీలైనంత పంపకాలు జరిపారు. పలుచోట్ల ఓటర్లను ప్రలోభపెడుతున్న అభ్యర్థుల అనుచరులను అధికారులు అరెస్ట్ చేశారు. ఓచోట మాత్రం అభ్యర్థులు మహిళా ఓటర్ల ఓట్లను రాల్చుకోవడానికి ముక్కు పుడకలు పంచి పెడుతున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్చిపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముక్కుపుడకలు పంచుతున్న సదరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 30 బంగారు ముక్కుపుడకలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.20 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.