నేను రబ్బర్ స్టాంప్‌ను కాదు..  - MicTv.in - Telugu News
mictv telugu

నేను రబ్బర్ స్టాంప్‌ను కాదు.. 

January 16, 2020

hbvb

సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) ఓ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య చీలికలు తెస్తున్నట్టుగానే ఉంది. ఇప్పటికే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వంపై గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర గరవర్నర్‌గా ఉన్న నాకు ఈ విషయం వార్తా పత్రికల్లో చూశాకే తెలిసింది. నాకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం సరైంది కాదు. నేను కేవలం రబ్బర్‌ స్టాంప్‌ను కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 

గవర్నర్‌ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా? అని ప్రశ్నించారు. దీనిపై తాను దృష్టి సారిస్తానని.. అయితే ఇక్కడ అనుమతి ముఖ్యం కాదని..  ప్రభుత్వం తనకు కనీస సమాచారం ఇవ్వలేదని భగ్గుమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, పాటించాల్సిన మర్యాదలను తుంగలో తొక్కిందని ఖాన్‌ ఆరోపించారు. కాగా, సీఏఏను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన తొలి ప్రభుత్వంగా కేరళ ప్రభుత్వం నిలుస్తుంది. సీఏఏ చట్ట ముఖ్యోద్ధేశంలో పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మూడు దేశాలను ఒకే గాటన తీసుకురావడం సరికాదని తన పిటిషన్‌లో కేరళ ప్రభుత్వం పేర్కొంది.