చిగుళ్ల వ్యాధి.. ఊడిపోయిన దంతాలు.. నోటి ఆరోగ్యం.. పేలవమైన బ్రషింగ్.. ఇతర సంకేతాలు, అలవాట్లు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ స్ట్రోక్ అసోసియేసన్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ లో స్ట్రోక్ మరణానికి ఇది ఐదవ కారణం అవుతుందట. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించబడిన ప్రాథమిక పరిశోధన ప్రకారం.. మీ దంతాలు, చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుందట. ఫిబ్రవరి 8 నుంచి 10, 2023 వరకు డల్లాస్ లో దీని పై సమావేశం జరుగనున్నది.
మెదడు ఆరోగ్యం పై..
గమ్ వ్యాధి, ఇతర నోటి ఆరోగ్య సమస్యలు గుండె జబ్బుల ప్రమాదకారకాలు. అవును మీరు విన్నది నిజం. అంతేకాదు.. అధిక రక్తపోటు వంటి ఇతర పరిస్థితులతో ముడి పడి ఉందని మునుపటి పరిశోధనల్లో తేలింది. ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపిక.. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని ప్రభావితం చేసినట్లే అవి మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నుంచి తాజా అంచనాల ప్రకారం.. యూఎస్ లోని ఐదుగురిలో ముగ్గురు వారి జీవితకాలంలో మెదడు వ్యాధితో బాధపడుతున్నారు.
అధ్యయనంలో..
2014 నుంచి 2021 మధ్య యూకే బయోబ్యాంక్ లో నమోదు చేయబడిన స్ట్రోక్ చరిత్ర లేకుండా దాదాపు 40 మంది పెద్దల్లో (46 శాతం పురుషలు, సగటు వయసు 57 సంవత్సరాలు) నోటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం మధ్య సంభావ్య సంబంధాన్ని విశ్లేషించారు. పాల్గొన్నవారు 105 జన్యు వైవిధ్యాల కోసం పరీక్షించబడ్డారు. తర్వాత జీవిత కాలంలో కావిటీస్, కట్టుడు పళ్లు, ఊడిపోయిన దంతాలు ఉండే వ్యక్తుల్లో మెదడు ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. పేలవమైన నోటి ఆరోగ్యం మెదడు ఆరోగ్యంలో క్షీణకు కారణం కావచ్చు. కాబట్టి నోటి పరిశుభ్రతతో మనం మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు.