Home > Featured > బంగారు గుండ్లు అనుకుంటే ఇనుములో కాలేసినట్లే 

బంగారు గుండ్లు అనుకుంటే ఇనుములో కాలేసినట్లే 

Not Gold It's Butterfly Pupae Viral Video

మెరిసేదంతా బంగారం కాదని అంటారు. అవును నిజమే మీరు చూసే ఈ వీడియో కూడా అలాంటిదే. బంగారపు రంగులో తళతళా మెరిసిపోతున్న ఈ గుడ్లు కూడా అలాంటివే. ఇది సీతాకోకచిలుక ప్యూపాకు సంబంధించింది. ఈ లార్వాల వీడియోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్‌‌ కశ్వన్ సోమవారం ట్విటర్‌లో‌ షేర్‌ చేశాడు. దీంతో అది వైరల్ అయ్యింది. తామెప్పుడు ఇలాంటి ప్యూపాలను చూడలేదని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి టిథోరియా టారిసినా, సీతాకోకచిలుకల ప్యూపాలుగా ఆయన పేర్కొన్నారు. మెక్సికోలో కనిపించే అరుదైన సీతాకోకచిలుక జాతికి చెందినవి. లార్వా-ఇమాగో మధ్య సీతాకోకచిలుకగా పరివర్తనం చెందె జీవ కీటక దశగా చెప్పారు. ఈ ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని ‘మచ్చల టైగర్వింగ్అని కూడా పిలుస్తారు. ఈ బంగారు గుండ్ల లాంటి లార్వా ఇప్పడు చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Updated : 18 May 2020 3:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top