16 ఏళ్ళ గ్రెటా థంబెర్గ్‌.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ - MicTv.in - Telugu News
mictv telugu

16 ఏళ్ళ గ్రెటా థంబెర్గ్‌.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్

March 15, 2019

స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ళ బాలిక ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయి చరిత్ర సృష్టించింది. వాతావరన మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థంబెర్గ్‌ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్‌ చేశారు. దీనిపై గ్రెటా థంబెర్గ్‌ స్పందిస్తూ..’నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. గత నెల పర్యావరణ మార్పులపై చర్య తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి గ్రెటా ఓ వీడియో సందేశాన్ని కూడా పంపింది. ఆ సందేశంలో క్లైమేట్ చేంజ్‌పై కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా కార్యాచరణ మొదలుపెట్టాలని మోదీకి సూచించింది.

Not Imran Khan, Meet the 16-Year-Old Nominated For Nobel Peace Prize for Awareness About Climate Change

గ్రెటా థంబెర్గ్‌ ప్రస్థానం… 2018 టైమ్స్‌ అత్యంత ప్రభావిత చిన్నారుల లిస్ట్‌లో గ్రెటాకు చోటుదక్కింది. క్లైమేట్ చేంజ్‌పై ప్రపంచ నాయకులు స్పందించాలంటూ 2018 ఆగస్టులో స్వీడన్ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టింది. క్లైమేట్ చేంజ్‌పై నాయకులు చర్యలు తీసుకునేలా విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చింది. అలాగే గత డిసెంబరులో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పులపై అద్భుతమైన ప్రసంగంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై తన ప్రసంగాన్ని వినిపించింది. అనంతరం క్లైమేట్ చేంజ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోదీతో సహా దేశాధినేతలకు ఓ వీడియో సందేశం పంపింది. ఒకవేళ గ్రెటా థంబెర్గ్‌ని నోబెల్‌ శాంతి బహుమతి వరించినట్లయితే.. ఇప్పటి వరకూ ఈ బహుమతి అందుకున్న వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించనుంది. పాకిస్థాన్‌కు చెందిన మాలాలా యూసఫ్‌ జాయ్‌ 17ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.