భారతీయులం కాదు.. పౌరసత్వం వదులుకున్న 7.5 లక్షల మంది - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులం కాదు.. పౌరసత్వం వదులుకున్న 7.5 లక్షల మంది

May 7, 2022

మేమంతా భారతీయులం కాదంటూ, ఏడున్నర లక్షల మంది పౌరసత్వం వదులుకున్నట్టు..కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2016వ సంవత్సరం నుంచి 2021ల మధ్య కాలంలో 7,49,765 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ శాఖ రాజ్యసభలో వెల్లడించింది.

విదేశాంగ శాఖ వివరాల ప్రకారం..”గత 6 సంవత్సరాలలో (2016 నుంచి 2021కి వరకు 7,49,765 మంది) ఏడున్నర లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. వారంతా 106 దేశాల్లో స్థిరపడ్డారు. 2019లో అత్యధికంగా 1,44,017 మంది పౌరసత్వాన్ని వదులుకోగా, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2020లో 85,248 మంది, 2021లో 1,11,287 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇదే కాలంలో మరో 6వేల మంది భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నారు.”