ఎన్నికల్లో పోటీపై నిర్భయ తల్లి స్పందన ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల్లో పోటీపై నిర్భయ తల్లి స్పందన ఇదీ..

January 17, 2020

Nirbhaya.

మరికొన్నిరోజుల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన 12 పోరాటం ఫలిస్తున్నందుకు భారత చట్టాల మీద నమ్మకం కలిగిందని అన్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకు జరగకూడదని ఆ తల్లి సుదీర్ఘ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఆమె పోరాటానికి ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆశాదేవి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వెళతారంటూ ప్రచారం మొదలైంది. 

కాంగ్రెస్ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.  నిర్భయ దోషి ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి పంపడంలో ఆలస్యం జరిగిందని, దీనికి నిరసనగా ఆశాదేవి సీఎం కేజ్రీవాల్‌పై పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఎట్టకేలకు వీటిపై ఆమె స్పందించారు. ‘నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. నన్ను కాంగ్రెస్ సహా మరే పార్టీ నేతలు సంప్రదించలేదు. నా కుమార్తెకు న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే పోరాడుతున్నాను. నేను రాజకీయాల్లో చేరుతున్నట్టు ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదు’ అని ఆశాదేవి అన్నారు.