Home > Featured > హెడ్‌స్కార్ఫ్‌ ధరించలేదని..ఇంటర్వ్యూ రద్దు

హెడ్‌స్కార్ఫ్‌ ధరించలేదని..ఇంటర్వ్యూ రద్దు

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి..తనను ఇంటర్వ్యూ చేయబోయే జర్నలిస్ట్ హెడ్‌స్కార్ఫ్‌ ధరించలేదని ఇంటర్వ్యూను రద్దు చేసుకున్న సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక దేశానికి అధ్యక్షుడు అయిన ఆయన..హెడ్‌స్కార్ఫ్‌ ధరించలేదని, ఇంటర్వ్యూ రద్దు చేసుకోవటం ఏంటి? అని నెటిజన్స్ షాక్‌కు గురౌతున్నారు. తాజాగా తమ దేశానికి విచ్చేసిన ఇరాన్‌ అధ్యక్షుడితో ఏలాగైనా ఇంటర్వ్యూ తీసుకోవాలని ఆశగా ఎదురుచూసిన, అమెరికా జర్నలిస్టు క్రిస్టినా అమన్‌పోర్‌కు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆమె మానసికంగా కృంగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే..అమెరికా జర్నలిస్టు అయిన క్రిస్టినా అమన్‌పోర్‌..తమ దేశంలో పర్యటిస్తున్న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసితో ఏలాగైనా ఇంటర్వ్యూ తీసుకోవాలని తాజాగా ఆయనను కలిసి అపాయిమెంట్ తీసుకుంది. ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వాలని వేడుకోవడంతో రైసి అంగీకరించారు. దాంతో ఆమె ఇంటర్వ్యూకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రతినిధి నుంచి ఓ కబురు వచ్చింది. "అమన్‌పోర్‌ నీ తలకు స్కార్ఫ్‌ ధరించలేదని, ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు రైసి నిరాకరించారు. అందుకు కారణం..ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా హెడ్‌స్కార్ఫ్‌ ధరించని మహిళతో ఆయన ఇంటర్వ్యూ చేయలేమని తేల్చి చెప్పారు". దాంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు.

అనంతరం ఆమె ట్విటర్ వేదికగా.."ఇరాన్‌ బయట జరిగిన ఇంటర్వ్యూలకు గతంలో ఏ ఒక్క ప్రెసిడెంట్‌ కూడా ఇలాంటి నిబంధన విధించలేదు. మేము న్యూయార్క్‌లో ఉన్నాం. ఇక్కడ హెడ్‌స్కార్ఫ్‌ ధరించే సంప్రదాయం లేదు" అని పేర్కొంటూ, రైసి ఇంటర్వ్యూకు రాకపోవడంతో, ఖాళీ కుర్చీ ముందు కూర్చున్న ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.

మరోపక్క ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం దుమారం రేపుతుంది. ఇటీవలే మహసా అమిని అనే 22 ఏళ్ల మహిళను అక్కడి పోలీసులు కొట్టడంతో, ఆ మహిళ గతవారం చనిపోయింది. దీంతో ఏడు రోజుల నుంచి ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. పోలీసులు తమ చేతిలో ఉన్న బాటన్‌తో అమిని తలను పదేపదే కొట్టారని, ఓ వాహనానికి ఆమె తలను బాదినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వివిధ నగరాల్లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. ఇటువంటి సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇంటర్వ్యూను రద్దు చేయటం సంచలనంగా మారింది.

Updated : 23 Sep 2022 1:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top