బీజేపీ, కాంగ్రెస్ తర్వాత నోటానే అతిపెద్ద పార్టీ! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ, కాంగ్రెస్ తర్వాత నోటానే అతిపెద్ద పార్టీ!

December 18, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచి ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ కూడా పనితీరును బాగా మెరుగుపరచుకుని 80 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. అయితే మరి.. ఎన్నికల్లో అతిపెద్ద మూడో పార్టీ ఏది? ఎన్సీపీ, బీఎస్సీ.. ఇవేవీ కాదు..! ఒక నాయకుడుగాని, కార్యకర్తలుగాని లేని నోటా.. అదేనండి.. అభ్యర్థులందర్నీ తిరస్కరించే నన్ ద అబోవ్ మీట.

గుజరాత్ ఎన్నికల్లో నోటాకు 1.8 శాతం ఓట్లు(5,40,566) ఓట్లు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఇది అతిపెద్ద మూడో  ‘పార్టీ’గా నిలిచింది. బీజేపీకి సీట్ల సంఖ్యను తగ్గించడంతో ఈ మీట బాగా పనిచేసిందని, దీనికి పడిన ఓట్లు కాంగ్రెస్‌కు దక్కి ఉంటే బీజేపీ మరింత ఇబ్బందుల్లో పడేదని చెబుతున్నారు. 15కుపైగా స్థానాల్లో విజేతలు, పరాజితుల మధ్య తేడా దాదాపు వెయ్యి ఓట్లే. ఈ స్థానాల్లో నోటాకు పడిన ఓడిన కాంగ్రెస్ పడి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషకులు అంటున్నారు.