Note to bike lovers..the price of this bike has increased
mictv telugu

బైక్ ప్రియులకు గమనిక..ఈ బైక్ ధరలు పెరిగాయి

September 23, 2022

దేశవ్యాప్తంగా హీరో కంపెనీ తయారు చేసిన బైక్‌ల గురించి తెలియని వారుండరు. సామాన్య ప్రజలు సైతం కొనుగోలు చేసేలా ధరలను అందుబాటులో ఉంచుతూ, ఆధునిక పరికరాలతో తయారు చేసిన కొత్త మోడళ్లను హీరో సంస్థ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తాజాగా హీరో బైక్‌లపై రూ.1,000 పెంచుతున్నట్లు ప్రకటించింది.

”హీరో మోటో కార్ప్ వాహనాల ధరలు పెరిగాయి. ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నాం. వాహనాల తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. అందుకే బైకుల ధరలు పెంచక తప్పడం లేదు. ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుంది. మేము విక్రయిస్తున్న మోటార్ సైకిళ్లతోపాటు, స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుంది. ఈ పెంపుతో రూ. 55,450 నుంచి రూ.1.86 లక్షల శ్రేణిలో టూవీలర్లను మార్కెట్లో అమ్ముతున్నాం” అని యాజమాన్యం ప్రకటనలో పేర్కొంది.

హీరో సంస్థ విషయానికొస్తే..హోండాగా స్థాపించబడిన ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ. బైక్‌ల అమ్మకాల్లో  మొదటి స్థానంలో కొనసాగుతుంది. 1984లో హీరో సైకిల్స్‌కు చెందిన ఓం ప్రకాష్ ముంజల్ జపానుకు చెందిన హోండా కంపెనీతో కలిసి హీరోహోండాను స్థాపించారు. 2010లో హీరో సంస్థ హోండాకు చెందిన షేర్లను కొనివేయడంతొ ఈ సంస్థ హీరో మోటోకార్ప్‌గా రూపాంతరం చెందింది.