అభ్యర్థులకు గమనిక.. నేటి నుంచే హాల్ టికెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థులకు గమనిక.. నేటి నుంచే హాల్ టికెట్లు

June 6, 2022

తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న 33 జిల్లాల అభ్యర్థులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. టెట్ పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. టెట్ పరీక్షను ఈ నెల 12న నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

అధికారులు మాట్లాడుతూ..” టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు పరీక్షా కేంద్రాల ఎంపిక పూర్తయింది. 33 జిల్లాల్లోనూ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగాసెంటర్లను అలాట్ చేశాం. అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేశాం. టెట్ పరీక్ష వచ్చే నెల 12న జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయి. వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఎగ్జామ్‌ను ఐదేండ్ల తర్వాత పెట్టడంతో ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చాం. ఈ కారణంగా భారీగా అప్లికేషన్లు వచ్చాయి” అని అన్నారు.