Home > Featured > రైతులకు గమనిక..అక్టోబర్ నుంచి ఒకే బ్రాండ్ ఎరువులు

రైతులకు గమనిక..అక్టోబర్ నుంచి ఒకే బ్రాండ్ ఎరువులు

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. 'వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్' అనే విధానంలో భాగంగా అక్టోబర్ నుంచి దేశం మొత్తం ఒకే రకమైన బ్రాండ్ ఎరువులను సరఫరా చేస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా వచ్చేనెల 15 నుంచి పాత బ్రాండ్స్ సంచులకు ఆర్డర్ ఇవ్వొద్దని ఎరువుల కంపెనీలను ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న పాత సంచులను డిసెంబర్ 31లోపు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవాలని ఆయా కంపెనీలకు ఉత్తర్వులు పంపింది.

"దేశవ్యాప్తంగా ప్రస్తుతం యూరియా, డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువులను వేరు వేరు కంపెనీలు వేరు వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి. 'వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్' విధానంలో భాగంగా దేశం మొత్తం 'ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వా రక్ పరియోజన' బ్రాండ్ పేరుతో విక్రయించాలని నిర్ణయించింది. అన్ని ఎరువులు కూడా ఇదే బ్రాండ్‌పై మార్కెట్లో అందుబాటులో ఉంటాయి" అని అధికారులు పేర్కొన్నారు.

ఇక, దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల షాపుల రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర పేరుతో ఎరువుల షాపుల రూపురేఖలను మార్చటానికి సిద్దమైంది. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల యాజమన్యాలతో చర్చలు కూడా జరుపుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం వేరు వేరుగా విక్రయిస్తున్న ఎరువులు అతికొద్ది రోజుల్లో ఒకే బ్రాండ్ పేరుతో దేశ మొత్తం ఎరువులు సరఫరా కానున్నాయి.

Updated : 24 Aug 2022 10:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top