Note to passengers: 15 trains cancelled..3 days
mictv telugu

ప్రయాణికులకు గమనిక: 15 రైళ్లు రద్దు..3 రోజులు

September 10, 2022

రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్యే ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. నేటి నుంచి మూడు రోజులపాటు 15 రైళ్లను రద్దు చేస్తున్నామని కాసేపటిక్రితమే ట్విటర్ వేదికగా ప్రకటించింది. కనుక ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను వాయిదా వేసుకోవటం గాని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరింది.

”నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహణ కారణంగా 15 రైళ్లను రద్దు చేస్తున్నాం. వీటిలో సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, రేపల్లె, మధిర, కాకినాడ, విశాఖపట్టణం మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. నేడు, రేపు మొత్తంగా 13 రైళ్లు రద్దయ్యాయి. 11వ తేదీన సికింద్రాబాద్-మధిర మధ్య నడిచే రైలు, 12వ తేదీన మధిర-సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు రద్దు చేయబడింది. ఇక, రద్దయిన రైళ్లలో కాకినాడ-విశాఖపట్టణం, కాకినాడ-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-రేపల్లె, గుంటూరు-విజయవాడ మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి” అని అధికారులు పేర్కొన్నారు.

రద్దైన రైళ్లు-వాటి నెంబర్లు, తేదీలు ఇవే..