Note to passengers..This train is canceled for 3 days
mictv telugu

ప్రయాణికులకు గమనిక..3 రోజులు ఈ రైలు రద్దు

August 8, 2022

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్యే అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. సికింద్రాబాద్-రాయ్‌పుర్ ఎక్స్‌ప్రెస్‌ను మూడు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కావున సికింద్రాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పురకు రాకపోకలు సాగించే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ రైలును రద్దు చేయడానికి ప్రధాన కారణం.. మహారాష్ట్రలోని నాగపుర్ డివిజన్లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశామని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-రాయ్‌పుర్ (12771) ఎక్స్‌ప్రెస్ 8,10,12వ తేదీల్లో, రాయ్‌పుర్-సికింద్రాబాద్ (12772) ఎక్స్‌ప్రెస్ 9,11,14వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండదని వివరాలను వెల్లడించారు.

అనంతరం త్రివేండ్రం-సికింద్రాబాద్ (17229) ఎక్స్‌ప్రెస్ ప్రయాణ వేళల్ని రైల్వేశాఖ మార్చింది. త్రివేండ్రం నుంచి ఉదయం 8.45 గంటలకు బదులుగా 10.15 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. ఈ నిర్ణయం ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 1 వరకు (ఆదివారాలు మినహా) అమల్లో ఉంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.