Note to students..Exams to be held today are postponed
mictv telugu

విద్యార్థులకు గమనిక..నేడు జరగాల్సిన పరీ‌క్షలు వాయిదా

September 9, 2022

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఉన్న కాళోజీ నారా‌య‌ణ‌రావు ఆరోగ్య విశ్వవి‌ద్యా‌లయం అధికారులు విద్యార్ధినీ, విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు గణేశ్‌ నిమ‌జ్జనం జరుగుతున్న కారణంగా విశ్వవి‌ద్యా‌లయ పరి‌ధిలో ఉన్న అన్ని కాలేజీల్లోని వైద్య విద్యా‌ర్థు‌లకు ఈరోజు నిర్వహించాల్సిన పరీ‌క్షలను వాయిదా వేస్తూ, నిర్ణయం తీసుకున్నామని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ఆ ప్రకటనలో..”తెలంగాణలో నేడు గణేశ్‌ నిమ‌జ్జనాన్ని పుర‌స్కరించు‌కొని రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రక‌టిం‌చింది. కనుక శుక్రవారం (ఈరోజు) జర‌గా‌ల్సిన ఎంబీ‌బీ‌ఎస్‌ మైక్రో బయా‌లజీ పరీ‌క్షను ఈ నెల 19న, బీడీ‌ఎస్‌ పెరియోడెంటా‌లజీ పరీ‌క్షను 21న, పోస్ట్‌ బేసిక్‌ నర్సింగ్‌ పరీ‌క్షను 30న నిర్వహిస్తాం. సెప్టెంబర్‌ 12 నుంచి జరిగే పరీ‌క్షల్లో ఎటు‌వంటి మార్పులు ఉండ‌వు. కావున విద్యార్ధులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షలకు సిద్దంకండి” అని అధికారులు తెలియజేశారు.