రైలు ప్రయాణికులకు గమనిక.. నేడు ఆరు రైళ్లు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

రైలు ప్రయాణికులకు గమనిక.. నేడు ఆరు రైళ్లు రద్దు

May 11, 2022

దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అసని’ తుపాను కారణంగా మరో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దు చేయబడిన రైళ్ల జాబితాను అధికారులు వెల్లడించారు.

1. గుంటూరు-రేపల్లె (07784),
2. రేపల్లె-గుంటూరు (07785),
3. గుంటూరు-రేపల్లె (07786),
4. రేపల్లె-తెనాలి (07873),
5. కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267),
6. విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ (17268) రైళ్లు ఉన్నాయి.

గుంటూరు-డోన్ (17228) మధ్య నడిచే రైలును అధికారులు రీ షెడ్యూల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ రైలు బయలుదేరాల్సి ఉండగా, మధ్యాహ్నం 3 గంటలకు మార్చినట్లు తెలిపారు.