వెంకన్న భక్తులకు గమనిక.. లడ్డు ప్రసాదంపై పరిమితి - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న భక్తులకు గమనిక.. లడ్డు ప్రసాదంపై పరిమితి

June 2, 2022

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో భక్తులకిచ్చే లడ్డూలపై టీటీడీ పరిమితి విధించింది. ఇప్పటి నుంచి ఒక ఉచిత లడ్డూతో పాటు రెండు లడ్డూలకు మాత్రమే కొనుగోలుకు అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రసాద విక్రయ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని లడ్డూలయినా కొనే అవకాశం భక్తులకు ఉండేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య రోజుకు 90 వేలను దాటుతుండగా, లడ్డూలు మాత్రం రోజుకు మూడు లక్షలు మాత్రమే తయారవుతున్నాయి. అయితే భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గుతుండడంతో ఇప్పుడిప్పుడే పరిమితిని నాలుగు లడ్డూలకి పెంచామని తెలిపారు.