వారందుకు లంచం అడిగారు.. మా నాన్న ఒక్కపైసా ఇవ్వనన్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

వారందుకు లంచం అడిగారు.. మా నాన్న ఒక్కపైసా ఇవ్వనన్నాడు

May 18, 2020

mfgh

వారు సూపర్ సక్సెస్ అయ్యారు. అతను సక్సెస్ ఐకాన్.. ఇలా పేరుగాంచిన వారి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు. కానీ, దాని వెనకాల వారి శ్రమ చాలా ఉంటుంది. కష్టపడి పైకి రావడానికి వారు ఎక్కని మెట్టు ఉండదు. అయితే కష్టపడేవారిని మోసం చేయడానికి కొందరు గంటకాడి నక్కల్లా కాచుకుని ఉంటారు. అలాంటివాళ్లను కూడా ఫేస్ చెయ్యడం కూడా స్ట్రగుల్స్‌లో భాగమే. వారి నోటి నుంచి వాటి తాలూకు అనుభవాలను చెప్పినప్పుడు అవునా అనిపిస్తుంది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెరీర్ ఆరంభ దశలో ఎదురైన ఓ ఘటనని ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రీతో నిర్వహించిన లైవ్ ఛాట్‌లో వెల్లడించాడు. ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం లంచం అడిగారని.. అయితే తన తండ్రి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకోలేదని కోహ్లీ తెలిపాడు. ఢిల్లీలో కొన్ని సమయాన్ని పనులు నిజాయితీగా జరగవని పేర్కొన్నాడు. 

సెలక్షన్ విషయంలో ఏ వ్యక్తి నిబంధనల ప్రకారం వెళ్లలేదని చెప్పాడు. ‘అతను మా నాన్నతో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవ్వాలంటే.. ఏదైన అదనంగా(లంచం) ఇవ్వాలని అన్నాడు. మా నాన్న బుడ్డ పైసా కూడా ఎక్కువివ్వను అన్నాడు. మా నాన్న ఓ మిడిల్‌క్లాస్ వ్యక్తి. ఒక విజయవంతమైన లాయర్‌గా జీవితం గడిపిన వ్యక్తి. ఆయన అదనంగా ఒక్క రూపాయి ఇచ్చేందుకు అస్సలు అంగీకరించలేదు. మీరు విరాట్‌ని ఎంపిక చేయాలంటే.. అతని మెరిట్ ప్రకారం చేయండి. అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఆయన తేల్చి చెప్పారు. ఆయన నుంచి నేను చాలా విలువలు నేర్చుకున్నాను’ అని విరాట్ తన కెరీర్ ఆరంభంలోని చేదు అనుభవాలను పంచుకున్నాడు.