Nothing Phone 1 gets MASSIVE PRICE CUT from Rs 37,999 to Rs 9,999 on Flipkart; Check offers
mictv telugu

ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.37 వేల ఫోన్.. రూ.10 వేల లోపే..

January 5, 2023

Nothing Phone 1 gets MASSIVE PRICE CUT from Rs 37,999 to Rs 9,999 on Flipkart; Check offers

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. నథింగ్ ఫోన్ 1 పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో , మంచి ఫీచర్స్‌తో లక్షల మందిని ఆకర్షించిన ఈ ఫోన్‌ను కేవలం పది వేల లోపే అందించనుంది ఫ్లిప్ కార్ట్. రూ. 37,999 ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో 29,999 రూపాయలకే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1(8GB+128GB) మోడల్ ప్రస్తుత ధర రూ. 29,999. ఇతర ఆఫర్‌లను వినియోగించుకుంటే రూ.10 వేలలోపు ధరకే లభిస్తుంది. నథింగ్‌ ఫోన్‌(1) కోసం వెయిట్‌ చేస్తున్న వారు ఈ బెస్ట్‌ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అయితే దీని కొనుగోలుపై పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసి రూ.20,000 వరకు డిస్కౌంట్‌ అందుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లలో భాగంగా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉన్నవారు 5 శాతం క్యాష్‌బ్యాక్‌కు అర్హులు. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ EMI చాయిస్‌లతో కూడా అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 1 మొదటి నెల నో-కాస్ట్ EMI ధర రూ. 4,584. ఇంకా కొనుగోలుదారులు Discovery+ మెంబర్‌షిప్‌పై 25 శాతం తగ్గింపును అందుకుంటారు.

నలుపు, తెలుపు రంగులతో అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ (1) ఫోన్‌లో అత్యాధునిక గ్లిఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్‌, , Qualcomm Snapdragon 778G+ ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. ఇది 60Hz నుంచి 120Hz వరకు అడ్జస్ట్‌ చేయగల రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్‌ HD+ OLED స్క్రీన్‌ను అందిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌, HDR10+తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4,500mAh బ్యాటరీతో వస్తుంది. వెనుకవైపు డ్యూయల్ 50 MP మోడర్న్ సెన్సార్, Sony IMX766 ఫ్లాగ్‌షిప్ కెమెరాతో ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అంతేకాక ఫోన్‌లో సీన్ డిటెక్షన్, నైట్ మోడ్ ఉన్నాయి.

సెల్ఫీలు తీసుకోవడానికి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్న నథింగ్ ఫోన్1 బ్యాటరీ లైఫ్ ఒక్కో ఛార్జ్‌కు 18 గంటల వరకు వస్తుందని నథింగ్ కంపెనీ తెలిపింది. చార్జింగ్ విషయంలో కేవలం ముప్పై నిమిషాల్లో సున్నా నుంచి యాభై శాతం ఛార్జ్ చేస్తుందని కూడా పేర్కొంది.