Notices issued to Ranveer Singh for nude photo shoot
mictv telugu

రణవీర్ న్యూడ్ ఫోటోషూట్.. విచారణకు రావాలని నోటీసులు

August 13, 2022

గత నెలాఖరులో న్యూడ్ ఫోటోషూట్ చేసి వార్తల్లోకెక్కిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారంలో ఓ ఎన్జీవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు రావాలని రణవీర్ సింగ్‌కు నోటీసులిచ్చారు. ఆ ఫోటోల ద్వారా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారిని అవమానపరిచేలా ఉన్నాయంటూ ఆ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత రణవీర్ ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. తర్వాత ఆయన ఇంట్లో ఉన్నారని తెలుసుకొని నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు చెంబూరు పోలీస్ స్టేషనుకి రావాలని అందులో పేర్కొన్నారు. కాగా, నగ్న ఫోటోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రణవీర్‌కు మద్ధతు తెలిపాడు. స్త్రీ జాతికి మేలు చేశాడంటూ అభినందించారు. అటు మహిళల సెంటిమెంట్లను గాయపరిచాడంటూ సాంప్రదాయవాదులు మండిపడ్డారు.