Notices to mp Raghuramaraj in case of purchase of TRS MLAs
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ ఎంపీకి నోటీసులు…

November 24, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించిన అధికారులు..కేసులో సంబంధమున్న వారికి నోటీసులు పంపిస్తున్నారు. తాజాగా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజుకు ఈ కేసులో నిందితులకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతనికి 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. అయితే నోటీసులు అందడంపై రఘురామరాజు ఇంతవరకు స్పందించ లేదు.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫును నరసాపురం ఎంపీగా రఘు రామకృష్ణంరాజు విజయం సాధించారు. తర్వాత తలెత్తిన విబేధాలు కారణంగా పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని టీడీపీ, జనసేనతో పాటు కేంద్రంలోని బీజేపీతో కూడా రఘురామరాజుకు సత్ససంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతడికి నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.