వారంలో నోటిఫికేషన్ : హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

వారంలో నోటిఫికేషన్ : హరీష్ రావు

April 18, 2022

03

వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు సోమవారం మీడియా ముఖంగా వెల్లడించారు. సంగారెడ్డిలో పోలీస్ ఉద్యోగాలకు ఇస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నిరుద్యోగుల సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడాలని సూచించారు. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు సంధించారు. కేంద్రంలో ఉన్న ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రలో నిరుద్యోగులకు ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు.