త్వరలోనే తెలంగాణలో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్‌.! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే తెలంగాణలో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్‌.!

February 22, 2022

09

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో దాదాపు 10 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అయితే, కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కాగా, ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా, భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 పోస్టులున్నాయి. అయితే వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లు ప్రకటించనున్నట్లు సమాచారం.

మరోపక్క తెలంగాణలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధనా సిబ్బంది పోస్టులన్నీ కలిపి, పది వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులన్నీ భర్తీ అయితే తెలంగాణలో పోలీస్‌ శాఖ తర్వాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే కాబోతోంది.