ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ. కోల్ కతాలోని హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో 24 డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జియోలజీ, సర్వే, అర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ఆర్, లా ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే…పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ డిప్లామాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 28, 2023వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక
పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ. 40000నుంచి రూ. 1.6 లక్షల వరకు జీతభత్యం చెల్లిస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
వయస్సు
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి.