Notification for agriculture posts to be released soon : Commissioner Harikiran
mictv telugu

త్వరలో మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ : వ్యవసాయ శాఖ కమిషనర్

October 24, 2022

ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని సోమవారం వెల్లడించారు. ఈ శాఖలో మొత్తం 6,758 అగ్రికల్చర్ అసిస్టెంట్, 4 వేల హార్టికల్చర్ అసిస్టెంట్, 400 సిల్క్ బోర్డు (పట్టు పరిశ్రమ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతంలో అనుమతులు మంజూరు అయ్యాయి.

అయితే వీటిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ 6321 పోస్టులు, 2356 హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు, 378 సిల్క్ బోర్డు అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిపోయిన పోస్టులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ప్రతీనెలా 1.51 లక్షల రైతు భరోసా మాస పత్రికలను ముద్రిస్తూ సాంకేతిక సలహాలు, సమాచారాన్ని అందిస్తున్నామని వివరించారు. అటు 5521 కాల్ సెంటర్ల ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, భర్తీ అయి మిగిలిపోయిన పోస్టుల సంఖ్య ఈ విధంగా ఉండనుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 437, హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 1644, సిల్క్ బోర్డు అసిస్టెంట్ పోస్టులు 22గా ఉండనున్నాయి. పూర్తి వివరాలు ప్రభుత్వం ప్రకటించే నోటిఫికేషన్‌ ప్రకారం ఉంటాయని గమనించండి.