ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు వరుసగా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ..కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేన్ జారీ చేసింది. పది ఫార్మసిస్ట్, టెక్సీషియన్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్ లేదా డిప్లోమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 22 నుంచి 43సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపును కలిపిచింది.
అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 15,17వ తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులకు రూ. 16,640నుంచి 19,500వరకు జీతభత్యం చెల్లిస్తారు. ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన అభ్యర్థులు OIL Hospital, Oil India Limited, Duliajan, Assam.ఈ అడ్రెస్సుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి.