Notification issued for filling 1681 nursing posts in AP
mictv telugu

ఏపీలో 1681 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

August 6, 2022

ఏపీలో జగన్ ప్రభుత్వం 1681 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను వైద్యారోగ్యశాఖ భర్తీ చేయనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 22 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్ టిక్కెట్లు జారీ చేసి సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు ఉన్న కాలేజీలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తవ్వాలి. జనరల్ అభ్యర్ధులకు 18 నుంచి 35 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. పరీక్ష విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు కేటాయించగా, పరీక్షా సమయం మూడు గంటలుగా నిర్ణయించారు.