ఐటీబీపీలో ఎలాంటి పరీక్ష లేకుండానే మెడికల్ ఆఫీస్ పోస్టుల భర్తీ..!! - MicTv.in - Telugu News
mictv telugu

ఐటీబీపీలో ఎలాంటి పరీక్ష లేకుండానే మెడికల్ ఆఫీస్ పోస్టుల భర్తీ..!!

February 15, 2023

ITBP

 

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ , సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‎లో వివిధ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‎మెంట్ 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీబీపీ మెడికల్ ఆఫీసర్ పోస్టులపై 250కి పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ITBP recruitment.itbpolice.nic.inఅధికారిక వెబ్‎సైట్ ద్వారా ఆన్‎లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గానూ ఆన్‎లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం అవుతాయి. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 16 వ తేదీ వరకు ఆన్‎లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
ఐటీబీపీ MO రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 297 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 185 ఖాళీలు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్లు)107 ఖాళీలు మెడికల్ ఆఫీసర్లు, కమాండెంట్లు 5 ఖాళీలు సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ల కోసం భర్తీ చేయనుంది.

విద్యా అర్హత & వయో పరిమితి:
సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్:
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS)గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి మెడిసిన్(DM)లేదా మాస్టర్ ఆఫ్ సర్జరీ (M.Ch)లో డాక్టరేట్.
వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్:
సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. వయస్సు 40ఏళ్లకు మించకూడదు.
మెడికల్ ఆఫీసర్:
ఎంబిబిఎస్, వయస్సు 30ఏళ్లు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పీఎస్టీ , మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము :
UR/OBC/EWS వర్గానికి చెందిన పురుష అభ్యర్థులు రూ.400 రుసుము చెల్లించాలి. SC/ST/మహిళలు, మాజీ సైనికుల కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.