రాతపరీక్ష లేకుండానే సింగరేణిలో ఉద్యోగాలు..నెలకు 1.25లక్షల జీతం..!! - MicTv.in - Telugu News
mictv telugu

రాతపరీక్ష లేకుండానే సింగరేణిలో ఉద్యోగాలు..నెలకు 1.25లక్షల జీతం..!!

February 15, 2023

singareni

 

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది సింగరేణి. పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 విభాగాల్లోఉన్న ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై..ఫిబ్రవరి 22,2023 చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేదని..కేవలం ఇంటర్వ్యూ ద్వారానే పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24, ఉదయం 9.30గంటలకు ఎస్ సీసీఎల్ ప్రధాన కార్యాలయం , కొత్తగూడెంకు అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.25లక్షల జీతభత్యం ఉంటుంది.

 

Notification release for Singareni jobs

అర్హత :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 64 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ పూర్తి చేయాలి.

ఖాళీలు:
విభాగాల వారిగా ఖాళీలు చూసినట్లయితే
-అనస్థీషియా 02,
-చెస్ట్ ఫిజీషియన్ 01,
– ఈఎన్టీ సర్జన్ 02,
-ఆప్త్మాలజిస్ట్ 03,
-పిడియాట్రీషియన్ 02,
-రేడియోలజిస్ట్ 01,
-జనరల్ సర్జన్ 02,
-గైనకాలజిస్ట్ 04,
-హెల్త్ ఆఫీసర్ 03,
-ఆర్థో సర్జన్ 02,
-ఫిజీషియన్ 04
కాగా మొత్తం 26పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మరిన్ని వివరాల కోసం www.scclmines.com అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోవచ్చు.