Notification Release To 1326 Doctors Posts In Telangana
mictv telugu

గుడ్ న్యూస్.. 1,326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల

June 15, 2022

Notification Release To 1326 Doctors Posts In Telangana

తెలంగాణలో వైద్య వృత్తిలో ఉన్న డాక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌లో ఖాళీగా ఉన్న 1,326 డాక్ట‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. 751 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్(డైరెక్ట‌రేట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) పోస్టులు, 357 ట్యూట‌ర్లు(డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్), 211 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ – జ‌న‌ర‌ల్ జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్(తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్), 7 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివేంటివ్ మెడిసిన్) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన వారి నుంచి వచ్చే నెల జులై 15 నుంచి ఆగ‌స్టు 14వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం https://mhsrb.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.