Notification released for 168 vacancies in DCCBs in AP
mictv telugu

డీసీసీబీలో 168 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉన్నవారు కావాలి

November 8, 2022

Notification released for 168 vacancies in DCCBs in AP

ఏపీలోని చిత్తూరు, ఏలూరు, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ 168 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఆన్‌‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఫీజు రూ. 590 అయితే.. ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు రూ. 413 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉండనుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20 అని నోటిఫికేషన్‌‌‌లో స్పష్టం చేశారు.