Indian Bank Jobs: బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? ఆ బ్యాంకులో 28 స్పెషలిస్ట్ పోస్టులు.వెంటనే అప్లయ్ చేసుకోండి..!! - Telugu News - Mic tv
mictv telugu

Indian Bank Jobs: బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? ఆ బ్యాంకులో 28 స్పెషలిస్ట్ పోస్టులు.వెంటనే అప్లయ్ చేసుకోండి..!!

February 23, 2023

బ్యాంకు ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ లో 128 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ, కంప్యూటీర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్ తోపాటు మరికొన్ని పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాలు అధికారికంగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..
ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 23.

ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పోస్టులు: 7

మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 13

ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు: 20

ఫారెక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 10

ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 50

హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 5

పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చెక్ చేసుకోండి.