Notification released for 4 thousand posts in kendreeya Vidyalayas
mictv telugu

కేంద్రీయ విద్యాలయాల్లో 4 వేల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

November 4, 2022

కేంద్రీయ విద్యాలయ సంగటన్ (kvs) దేశవ్యాప్తంగా ఉన్న వివిద కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 4 వేల టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ తదితర 4014 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమెస్ట్రీ, సంస్కృతం, సోషల్ సబ్జెక్టుల్లో టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://kvsangathan.nic.in/ ని చూడవచ్చు. ఇక విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.

1. ప్రిన్సిపాల్ పోస్టులు- 278 2. వైస్‌ ప్రిన్సిపల్ పోస్టులు- 116 3. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు- 7 4. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు- 22 5. పీజీటీ పోస్టులు- 1200 6. టీజీటీ పోస్టులు- 2154 7. హెడ్ మాస్టర్ పోస్టులు- 237 గా ఉన్నాయి.