Notification released for 544 Degree Lecturer posts in telangana
mictv telugu

544 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలున్నాయంటే

January 2, 2023

Notification released for 544 Degree Lecturer posts in telangana

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 544 ఖాళీలుండగా, దరఖాస్తు ప్రక్రియ జనవరి 31 నుంచి మొదలై ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ చూసి తెలుసుకోవచ్చు. అసిస్టెంబ్ ప్రొఫెసర్ పోస్టులు సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి. ఇంగ్లీష్ పోస్టులు: 23, తెలుగు పోస్టులు: 27, ఉర్దూ పోస్టులు: 2, సంస్కృతం పోస్టులు: 5, స్టాటిస్టిక్స్‌ పోస్టులు: 23, మైక్రో బయాలజీ పోస్టులు: 5, బయో టెక్నాలజీ పోస్టులు: 9, అప్లైడ్ న్యూట్రిషన్ పోస్టులు: 5, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్ పోస్టులు: 311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు: 39, కామర్స్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ పోస్టులు: 8, డైరీ సైన్స్ పోస్టులు: 8, క్రాప్‌ ప్రొడక్షన్‌ పోస్టులు: 4, డేటా సైన్స్ పోస్టులు: 12, ఫిషరీస్ పోస్టులు: 3, కామర్స్‌-విదేశీ వాణిజ్యం పోస్టులు: 1, కామర్స్‌ ట్యాక్సేషన్‌ పోస్టులు: 6 ఉన్నాయి. వీటితో పాటు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29 ఉన్నాయి.