డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..వైస్ ఛాన్సలర్ - MicTv.in - Telugu News
mictv telugu

డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..వైస్ ఛాన్సలర్

July 2, 2022

 

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన గృహిణీలు, ప్రైవేట్ ఉద్యోగులు, చదువును మధ్యలో ఆపేసి వివిధ పనులు చేసుకుంటూ పార్ట్ టైంగా చదువుకోవాలని ఆశగా ఉన్నవారికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ శుభవార్తను చెప్పింది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు తెలిపారు.

వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ..” డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ/ఎం.కాం/ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులకు, బీఎల్‌ఎస్‌ఈ, ఎంఎల్‌ఎస్‌ఈ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ 2022-23 విడుదలైంది. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలకు www.braouonline.in, www.braou.ac.in వెబ్‌సైట్లను సందర్శించండి. 2021-22 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్‌ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఈ నెల 31లోపు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌‌లో చెల్లించండి. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారానే ఆప్లై చేసుకోవాలి. ఈ నెల 31 వరకు చివరి తేది” అని ఆయన అన్నారు.