notification released for filling 1226 vacancies in Telangana Courts
mictv telugu

తెలంగాణ కోర్టుల్లో 1226 ఉద్యోగాలు.. జిల్లాల వారీ పోస్టులు ఇలా ఉన్నాయి

January 4, 2023

తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు సహా జిల్లాల కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు 1226 ఉండగా, వీటికి ఏడు నుంచి పదో తరగతి చదివిన వారు అర్హులు. అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు అనర్హులు. అభ్యర్ధుల వయసు జులై1, 2022 నాటికి 18 నుంచి 34 మధ్య ఉండాలి. జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీలకు ఫీజు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ. 400 ఫీజు ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దీనిని 2023 మార్చిలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి పేస్కేల్ రూ. 19 వేల నుంచి 58 వేల 850 వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు https://tshc.gov.in/getRecruitDetails

వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

1. కోర్టు ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సీబీఐ, హైదరాబాద్‌లో 36
2. సిటీ సివిల్ కోర్టు, హైదరాబాదులో 125
3. సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాదులో 26
4. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్, హైదరాబాద్ 128
5. రంగారెడ్డి 150
6. హనుమకొండ 19
7. జగిత్యాల 32
8. జనగామ 13
9. జయశంకర్ భూపాలపల్లి 18
10. జోగుళాంబ గద్వాల 25
11. కామారెడ్డి 14
12. కరీంనగర్ 12
13. ఖమ్మం 13
14. కుమ్రం భీం అసిఫాబాద్ 11
15. మహబూబాబాద్ 13
16. మంచిర్యాల 14
17. మహబూబ్ నగర్ 33
18. మెదక్ 16
19. మేడ్చల్ మల్కాజ్‌గిరి 92
20. ములుగు 14
21. నాగర్ కర్నూల్ 28
22. నల్గొండ 55
23. నారాయణ పేట 11
24. నిర్మల్ 18
25. నిజామాబాద్ 20
26. పెద్దపల్లి 41
27. రాజన్న సిరిసిల్ల 26
28. సంగారెడ్డి 30
29. సిద్దిపేట 25
30. సూర్యాపేట 38
31. వికారాబాద్ 27
32. వనపర్తి 19
33. వరంగల్ 21
34. యాదాద్రి భువనగిరి 34
35. ఆదిలాబాద్ 10
36. భద్రాద్రి కొత్తగూడెం 19