ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

November 28, 2022

ఏపీలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. వివిధ విభాగాల్లో 6 వేల 100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్సై పోస్టులను భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 3,580 కానిస్టేబుల్ పోస్టులు సివిల్ విభాగంలో, 2,520 పోస్టులు ఏపీఎస్పీలో భర్తీ చేయనున్నారు. 315 సివిల్ ఎస్సై పోస్టులు, 96 రిజర్వ్ ఎస్సై పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా స్వీకరించనున్నారు.

ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న, కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సై పోస్టులకు డిసెంబర్ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెలా 30 నుంచి వచ్చే నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్లో కానిస్టేబుల్ పోస్టులలో హోంగార్డులకు 105 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులలో 25 శాతం రిజర్వేషన్ కల్పించారు.