తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 12 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 30న పోలింగ్ తేదీగా నిర్ణయించింది. అదే రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనుండగా, సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు.
ఇందుకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికయ్యే అభ్యర్ధి పదవీకాలం ఏప్రిల్ 2024 వరకు ఉండనుంది.