Notification released for the posts in AP Courts
mictv telugu

కోర్టుల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. 7వ క్లాస్ పాసయితే చాలు

October 24, 2022

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టులో ఖాళీగా ఉన్న 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 2022 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో నవంబర్ 11 రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ. 800, ఈ డబ్ల్యూఎస్ రూ. 500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ. 400 లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వేరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రూ. 23,780 నుంచి రూ. 76,730 వరకు జీతంగా చెల్లిస్తారు.

జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే.. అనంతపురం 53, చిత్తూరు 67, తూర్పు గోదావరి 80, శ్రీకాకుళం 62, ప్రకాశం 41, విశాఖ పట్నం 71, గుంటూరు 64, వైఎస్సార్ కడప 46, కర్నూలు 17, నెల్లూరు 33, కృష్ణా 68, విజయనగరం 21, పశ్చిమ గోదావరి 58 ఖాళీలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం https://hc.ap.nic.in/ ని చూడండి. ఇక జిల్లాల్లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 1520 ఉన్నాయి. వీటికి విద్యార్హత ఏడో తరగతి లేదా తత్సమాన కోర్సులు పాసవ్వాలి. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయవద్దు. పైన పేర్కొన్నట్టు రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు తేదీలు ఒకేలా ఉన్నాయి. ఎంపికైన వారికి జీతం రూ. 20 వేల నుంచి రూ. 61,960 వరకు చెల్లిస్తారు. జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే.. అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్సార్ కడప 83, కృష్ణా 204, కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, పశ్చిమ గోదావరి 108, విజయనగరం 57, విశాఖ పట్నం 125, శ్రీకాకుళం 87 పోస్టులు ఉన్నాయి.