డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..

October 21, 2017

తెలంగాణలోని నిరుద్యోగులకు కలనేరరింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్ శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. 8,792 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టులు సంఖ్య తదితర వివరాలతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు ఉన్న డీఎస్సీ తరహాలో ఒకే పరీక్ష ఉంటుంది. 31 జిల్లాల్లో పరీక్ష ఉంటుందని, ఒక పోస్టు కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఉంటుంది. టీఆర్‌టీకి 4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

పోస్టలు వివరాలు..

స్కూల్ అసిస్టెంట్లు 1941

పీఈటీ 416

పీఈటీ స్కూల్ అసిస్టెంట్లు 9

లాంగ్వేజ్ పండిట్లు 1011

సెంకడరీ గ్రేడ్ టీచర్లు 5415

మొత్తం 8792 పోస్టులు

-కేటగిరీల వారిగా 5 వేర్వేరు నోటిఫికేషన్లు

-ఈ దఫా ఎస్జీటీల్లో ఇంగ్లీష్ మీడియం పోస్టుల భర్తీ

-పీఈటీ అభ్యర్థులకు టెట్ తో పనిలేదు

తెలుగు మీడియంలో

-స్కూల్ అసిస్టెంట్లు: 1754

-ఎస్జీటీ: 4779

-లాంగ్వేజ్ పండిట్స్: 985

ఉర్దూ మీడియంలో

-స్కూల్ అసిస్టెంట్లు: 196

-లాంగ్వేజ్: 26

-ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ): 42

-ఎస్జీటీ: 636

ఎస్ఈఆర్టీ సిలబస్

-టీఆర్టీ సిలబస్లో మార్పులేదు

-తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత

-రోస్టర్ పాయింట్లు, స్థానికత, ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం

-న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు

-4 నుంచి 10 వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణ

-పుట్టిన, చదివిన జిల్లాల్లో ఒకదాన్ని పరీక్షకు ముందే ఎంచుకునే వెసులుబాటు

దరఖాస్తు – గడువు

-ఈ నెల 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

-అప్లైకి నెల రోజుల గడువు

-2 నెలలు ప్రిపరేషన్ గడువు

-3 నుంచి 31|2 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి.